![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -372 లో.. బాబు కోసం కావ్య బొమ్మలు తీసుకొని వెళ్తుంటే.. కనకం కృష్ణమూర్తి ఇద్దరు ఎదురుపడతారు. తప్పు చేసిన భర్తని నిలదియ్యకుండా, ఎందుకు ఇలా బాబుకి బొమ్మలు తీసుకొని వెళ్తున్నావంటూ కనకం తిడుతుంది. ఇప్పుడే నీ భర్తని ఎందుకు అన్యాయం చేసావంటూ నలుగురిలో నీలదియ్యి పరువు తియ్ అంటూ కనకం అంటుంది.
పరువు తియ్యాలి.. మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నందుకు, అక్కపై నింద పడ్డప్పుడు మనకి సాయం చేసాడు కదా.. మీ ఇంటికి వచ్చి నేను హెల్ప్ చెయ్యడానికి ఒప్పుకున్నందుకు అంటూ రాజ్ కి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. నా భర్త వేరొక అమ్మాయిని తల్లి ని చేసాడంటే నేను నమ్మను.. దాని వెనకలా పెద్ద కారణం ఉందనిపిస్తుంది. ఒకవేళ నా భర్త తప్పు చేసాడని తెలిసిన రోజు.. నా మనసులో నుండి అతన్ని తొలగించి వస్తాను కానీ అతని పరువు తియ్యను.. మౌనంగా అప్పుడు మీ దగ్గరికి వస్తానని కావ్య తన తల్లి తండ్రిలకి సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు బాబుని తీసుకొని రాజ్ ఆఫీస్ కి వెళ్ళాడని ఇంట్లో అందరూ కోపంగా ఉంటారు. అపుడే రాజ్ వస్తాడు.. ఈ ఇంటి పరువు భుజాన వేసుకొని వెళ్ళావ్.. రోజు రోజుకు బరువు పెరుగుతుందని అపర్ణ అంటుంది. ఇక బరువుని దించెయ్ అని అనగానే.. అది జరగదు అన్నట్టుగా రాజ్ సమాధానం చెప్తాడు.
నువ్వు నిజం చెప్పవ్.. ఆ బిడ్డని తల్లికి అప్పజెప్పవ్.. నీకు నచ్చింది చేస్తావ్. దీనికి పరిష్కారం ఏంటని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. ఆ బిడ్డని వదిలేయ్ లేదంటే.. ఎండీ పదవి నుండి పక్కకు తప్పుకోమని అపర్ణ అంటుంది.. ఎండీ పదవి నుండి పక్కకి తప్పుకోవడానికి నేను సిద్ధం అని రాజ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. రాజ్ బాబుని తీసుకుని తన గదికి వెళ్తాడు. ఎండీ బాధ్యతలు రాహుల్ కి దక్కాలని రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |